Mint Tomato Chutney: పుదీనా టమాటో పచ్చడి ఇలాచేస్తే ప్రతి ముద్ద కమ్మగా తినేస్తారు..

';

ఒక ప్యాన్‌ తీసుకుని అందులో నువ్వులు వేసి డ్రై రోస్ట్‌ చేసుకోవాలి.

';

అదే ప్యాన్‌లో నూనె పోసి 8 పచ్చిమిర్చి, ఒక కట్క పుదీనాఆకులు, జిలకర్ర వేసి వేయించాలి.

';

వీటిని పక్కకు తీసి మిక్సీలో వేయాలి.

';

ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి పావుకిలో వరకు టమాటోలను కట్‌ చేసి వేయించుకోవాలి

';

నూనె పైకి తేలాకా ఇందులో కాస్త చింతపండు కూడా వేసుకుని చల్లారనివ్వాలి

';

పుదీనా పచ్చిమిర్చి వేసుకున్న మిక్సీలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కాస్త ఎండు కొబ్బరి ముక్క కూడా వేసి మిక్సీ పట్టాలి

';

ఆ తర్వాత చల్లారిన టమాటోలను కూడా వేసి బరకగా రుబ్బుకోవాలి.

';

ఇప్పుడు స్టవ్‌ పై ఓ ప్యాన్ పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి

';

ఆవాలు, జిలకర్ర ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేసాకు వేసి చిటపటలాడించాలి.

';

ఆ తర్వాత ఇందులో ఇంగువ, ఒక అరచెంచా పసుపు కూడా వేసుకోవాలి.

';

ఈ తాలింపులో టమాట పచ్చడిని వేసుకుని కలుపుకుంటే టమాటా చట్నీ రెడీ

';

VIEW ALL

Read Next Story