ప్రస్తుతం మనకున్న బిజీ లైఫ్ స్టైల్ వల్ల.. మనం ఎక్కువగా ప్రెజర్ కుక్కర్స్ వాడుతూ ఉంటాం.
అయితే కుక్కర్లో పప్పు లేదా అన్నం ఉడకబెడుతున్నప్పుడు.. నీరు బయటకు వచ్చే సమస్య ఎక్కువ మందికి ఎదురవుతుంది.
కాగా ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి చిన్న చిట్కా పాటిస్తే చాలు.
పప్పు లేదా బియ్యం నీటిలో కొద్దిగా నెయ్యి వెయ్యండి.
అలాగే కుక్కర్ పైన ఉన్న విజిల్ చుట్టూ నెయ్యిని పూయండి. ఈ చిన్న చిట్కాను పాటించడం వల్ల ప్రెషర్ కుక్కర్ నుంచి బయటికి నీరు పొంగదు.
అయితే ఈ చిట్కా పాటించే మందు.. కుక్కర్ విజిల్ ని కూడా ఒకసారి సరిగ్గా చెక్ చేసుకోండి. కుక్కర్ విజన్ లో ఏవైనా చిన్ని చిన్ని పదార్థాలు చిక్కుకున్న ఇలా నీరు బయటకి రావచ్చు.