కార్న్ దోశ.. నిమిషాలలో ఎలా చేసుకోవాలంటే.. ముందుగా ఒక కొప్పులో మొక్కజొన్న గింజలు తీసి పెట్టుకోండి.
అందులో అరకప్పు రవ్వ వేసుకోండి…ఇప్పుడు ఈ రెండిటిని కలిపి మిక్సీలో వేసుకోండి.
అందులోనే సన్నగా తరిగిన మూడు పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తురుము వేసుకోండి
తరువాత దోశ పిండికి సరిపడా నీళ్లు పోసుకుని.. ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టుకొంది.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి.
అందులోనే కొంచెం చిల్లీ ఫ్లెక్స్.. రుచికి సరిపడా ఉప్పు.. కొత్తిమీర తురుము వేసుకొని దోశ పిండిలా కలుపుకోండి.
ఇప్పుడు దీన్ని పెనుమ మీద నూనె వేసుకొని.. దోశలా పోసుకొని రెండు వైపులా కాల్చండి. అంతే ఎంతో క్రిస్పీ కార్న్ దోశ రెడీ..