పెరుగు- పావు కప్పు ఆలుగడ్డలు కట్ చేసినవి -నాలుగు నెయ్యి- రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర -ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు -ఒక స్పూను ధనియాల పొడి- 4 టేబుల్స్
జీలకర్ర పొడి -రెండున్నర టేబుల్ స్పూన్లు కారంపొడి- ఒక టేబుల్ స్పూన్ పసుపు- పావు స్పూను ఉప్పు-రుచికి సరిపడా గరం మసాలా -ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర-1
ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో నెయ్యి వేసి జీలకర్ర వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి.
ధనియాలు, జీలకర్ర, కారంపొడి, పసుపు కూడా వేసి బాగా కలపాలి ఆ తర్వాత బంగాళదుంపలు కూడా మిక్స్ చేసి మూడు నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు ఒక కప్పు నీళ్లు పోసి తక్కువ మంటపై మూత పెట్టి బంగాళదుంపలు మెత్తగా ఉడికే వరకు మరిగించుకోవాలి.
ఇప్పుడు పెరుగు గరం మసాలా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర ఆకుల్లో కూడా వేసుకోవాలి
లంచ్ లోకి ఈ రెసిపీ ఎంతో బాగుంటుంది మీకు నచ్చినట్లేనా