రసం రోజు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి అలాంటి రసం పొడి ముందుగా ఎలా చేసి పెట్టుకోవాలంటే..
ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి ఒక కప్పు ధనియాలు వేసుకొని వేయించుకోండి.
ధనియాలను.. చిన్న మంట మీద పెట్టి వేయిస్తే బాగా వేగుతాయి.
ఆ తరువాత పావు కప్పు జీలకర్ర, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు మిరియాలు వేయించుకోండి.
ఆ తరువాత అందులోనే 16 ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి.చివరగా గుప్పెరు కరివేపాకులు వేసి వేయించండి. ఈ మిశ్రమం మొత్తం చల్లారాక మిక్సీకి వేసుకోండి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో.. అర స్పూన్ ఇంగువ, ఒక స్పూన్ పసుపు వేసి మరోసారి మిక్సీ పట్టండి.
ఈ రసం పొడిని ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి. దాదాపు ఆరు నెలల వరకు ఈ పొడి పాడవదు. అంతేకాకుండా ఎంతో రుచికరమైన రసం పెట్టుకోవచ్చు.