ఈ ఇడ్లీలు రోజు తింటే ఐరన్ లోపానికి చెక్.. బరువు కూడా తగ్గుతారు!
Dharmaraju Dhurishetty
Nov 21,2024
';
చాలామంది రాగి పిండితో తయారుచేసిన జావాను ఎక్కువగా తాగుతూ ఉంటారు. నిజానికి దీనికి బదులుగా ఇదే పిండితో తయారుచేసిన ఇడ్లీలను తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.
';
రాగి పిండితో తయారుచేసిన ఇడ్లీలను రోజు ఉదయం అల్పాహారంలో తీసుకుంటే ఐరన్ లోపం నుంచి సులభంగా విముక్తి కలుగుతుంది.
';
రాగి పిండిలో ఉండే అద్భుతమైన పోషకాలు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అలాగే శరీర బరువును నియంత్రిస్తాయి.
';
మీరు కూడా ఇంట్లోనే సులభంగా రాగి పిండితో ఇడ్లీలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.
';
రాగి ఇడ్లీల తయారీకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, ఉడికించిన పెసలు - 1/4 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఇడ్లీ అచ్చులను నూనె రాసుకోవడానికి
';
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత ఇడ్లీ రవ్వ, రాగి పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
';
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, పెరుగు వేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా నీటితో మిశ్రమంలో తయారు చేసుకోవలసి ఉంటుంది.
';
ఆ తర్వాత ఈ బ్యాటర్‌ను నాలుగు నుంచి ఐదు గంటల పాటు పక్కన పెట్టుకొని బాగా పులియబెట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా పక్కన పెట్టుకున్న పిండిని ఇడ్లీ పాత్రల్లో వేసుకొని స్టవ్‌పై ఆవిరిలో దాదాపు 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి.
';
ఇలా ఉడికిన ఇడ్లీలను ఓ బౌల్లోకి తీసుకొని పల్లి చట్నీతో లేదా ఇతర చట్నీలతో సర్వ్ చేసుకుని తింటే బోలెడు ప్రయోజనాలు పొందుతారు.