ట్రావెల్ సమయంలో వెంట్రుకలు పిచ్చికుగూడులా అయ్యి ఆఫీసుకు వెళ్లే లోపల.. మన మొహం రూపురేఖలే మారిపోతూఉంటాయి. దీన్నే హెయిర్ ఫ్రిజ్ అవ్వడం అని కూడా అంటారు. మన హెయిర్ ఫ్రిజ్ ఫ్రీ గా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు .
వారానికి రెండుసార్లు కనీసం నూనె పెట్టుకోవడం వల్ల వెంట్రుకల ఫ్రీజ్ తగ్గుతుంది. అంతేకాదు ట్రావెల్ చేసేటప్పుడు సిల్క్ స్కార్ఫ్ లాంటిది.. తల చుట్టూ చుట్టుకోవడం మేలు.
తలస్నానం చేసే ముందు ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయండి, ఇది జుట్టును మృదువుగా ఉంచుతుంది.
బయటకు వెళ్లే ముందు.. సన్ ప్రొటెక్షన్ స్ప్రే లేదా జుట్టు కవర్ చేయడం ద్వారా తేలికపాటి దుమ్ము జుట్టుపై పడి మన జుట్టు ఫ్రిజ్ అవ్వకుండా..నివారించవచ్చు.
ఉప్పు నీటి స్ప్రే లేదా ఫ్రిజ్ కంట్రోల్ సీరమ్.. వాడడం లాంటివి చేయడం వల్ల కూడా.. ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ మన సొంతమవుతుంది.
వీటన్నిటితో పాటు..ప్రతిరోజూ జుట్టుకు మంచి పోషణ కలిగే ఆహారం తీసుకోవడం.. జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు.. వైద్య నిపుణుల సలహాల మేరకు.. చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.