నీరసం, బలహీనత, నిస్సత్తువ, రోజంతా ఉత్సాహంగా పని చేసుకోకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారు ఇది తప్పకుండా ట్రై చేయాల్సిందే.

Shashi Maheshwarapu
Jun 29,2024
';

ఉదయం పూట ఎనర్జిటిక్ ఫుడ్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

';

ఈ ఫుడ్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

';

కాబట్టి ఈ రోజే మీరు కూడా ఈ ఫుడ్ ను తయారు చేసుకుని తినండి.

';

కావలసినవి: తరిగిన బాదంపప్పు - 15 గ్రాములు, నానబెట్టిన సబ్జా గింజలు - ఒక టేబుల్ స్పూన్, ఓట్స్ - అర కప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పు

';

కావలసినవి: తరిగిన ఆపిల్ - 1, చిన్న ముక్కలుగా తరిగిన అరటిపండు - 1, కాచిన పాలు - 2 కప్పులు, బెల్లం పొడి - 2 టేబుల్ స్పూన్లు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో పాలు, నీళ్ళు పోసి వేడి చేయండి.

';

పాలు ఒక పొంగు వచ్చిన తరువాత బాదంపప్పు, ఓట్స్ వేసి కలపండి.

';

ఓట్స్ ఉడికిన తరువాత సబ్జా గింజలు వేసి 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి.

';

తరువాత బెల్లం పొడి వేసి కలపండి.

';

తరువాత అరటిపండు ముక్కలు, ఆపిల్ ముక్కలు వేసి కలపండి.

';

ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎనర్జిటిక్ ఫుడ్ తయారవుతుంది.

';

బరువు తగ్గాలనుకునే వారు, బీపీతో బాధపడే వారు, షుగర్ వ్యాధి గ్రస్తులు ఇలా ఎవరైనా దీనిని తీసుకోవచ్చు.

';

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఈ ఫుడ్ ను తీసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story