Soft and Rosy Lips: మీ పెదాలు గులాబీ రేకుల్లో మెత్తగా మిళమిళలాడాలంటే ఈ 4 టిప్స్ పాటించండి
పగిలిన పెదాల సమస్య నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్‌లో చాలా లిప్ బామ్‌లు ఉన్నాయి. కానీ అందులో కెమికల్స్ ఉంటాయి
అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా కొన్ని సులభమైన టిప్స్ అందిస్తున్నాం. ఇవి మీ పెదాల్ని క్షణాల్లో మృదువుగా మార్చేస్తాయి
జైతూన్ లేదా కొబ్బరి నూనెలో దాల్చిన చెక్క పౌడర్, తేనె కలిపి పెదాలపై తేలిగ్గా స్క్రబ్ చేసుకోవాలి. దీనివల్ల పెదాలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి
ఒక చెంచా గ్లిసరిన్‌లో కొద్దిగా రోజ్ వాటర్, అల్లోవెరా జెల్ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీనిని కొద్ది గంటలు ప్రిజ్‌లో ఉంచాలి. రోజూ రాత్రి వేళ పెదాలకు రాసుకోవాలి
పగిలిన పెదాల సమస్యకు నెయ్యి అద్భుతమైన పరిష్కారం. రోజూ రాయడం వల్ల పెదాలు మృదువుగా మెత్తగా గులాబీ రేకుల్లా తయారవుతాయి
రాత్రి వేళ లిప్‌స్టిక్ తొలగించడం మర్చిపోకూడదు. దాంతోపాటు నీల్లు ఎక్కువగా తాగాలి. బీట్‌రూట్, క్యారట్, దానిమ్మ తప్పకుండా తినాలి