కండలు పెంచే ఐస్ క్రీమ్ రెసిపీ.. రుచి వేరే లెవెల్..
Dharmaraju Dhurishetty
Sep 14,2024
';
ప్రస్తుతం చాలామంది ఎక్కువగా బయట లభించే ఐస్ క్రీమ్స్ తింటున్నారు. వీటిని తినడం అంత మంచిది కాదు..
';
అతిగా ఐస్ క్రీమ్స్ తినడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లోనైతే పళ్ళు పుచ్చుకోవడం ఇతర సమస్యలు రావచ్చు.
';
బయట లభించే ఐస్ క్రీమ్స్ కంటే ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
';
మీరు కూడా ఇంట్లోనే సులభంగా ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్ ని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ రెసిపీ మీ కోసమే..
';
బనానాతో తయారు చేసిన ఐస్ క్రీమ్ తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్, పొటాషియం, పోషకాలు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి.
';
అంతేకాకుండా ఈ బనానా ఐస్ క్రీమ్ ని జిమ్ చేసే వారి తినడం వల్ల కండలు కూడా మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
';
ఇలా సులభంగా ఇంట్లోనే అరటిపండు ఐస్ క్రీమ్ ని తయారు చేసుకోండి..
';
బనానా ఐస్ క్రీంకి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు - 2-3, పాలు - 1 కప్పు, పంచదార - 1/4 కప్పు (రుచికి తగినట్లుగా), వెనిలా ఎసెన్స్ - కొన్ని చుక్కలు, బాదం ముక్కలు లేదా గింజలు
';
తయారీ విధానం..అరటిపండ్లను తయారు చేసుకోవడం: అరటిపండ్లను తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి ఫ్రీజ్‌లో 2-3 గంటలు ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని మిక్సీలో మిశ్రమంలో తయారు చేసుకోవాలి.
';
మిక్సీలో గ్రైండ్ చేయడం: గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోనే పాలు, పంచదార, వెనిలా ఎసెన్స్ అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి.
';
ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక చిన్న కంటైనర్ లో కోసుకొని ఫ్రిడ్జ్‌లో 12 గంటల పాటు ఉంచాల్సి ఉంటుంది.
';
సర్వ్ చేయడం: ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఐస్ క్రీమ్ పై బాదం ముక్కలు లేదా ఇతర గింజలతో అలంకరించి సర్వ్ చేయండి.