మన అందరికీ నెల్లూరు చేపల పులుసు ఎంతో ఇష్టమవ్వచు.. కానీ మంగళూరు చేపల పులుసు కూడా ఎంతో రుచిగా ఉంటుంది.
ఈ స్టైల్ లో తయారు చెయ్యడానికి ముందుగా.. మిక్సీ జార్లో 8 ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర తరుగు, జీలకర్ర, నిమ్మకాయ సైజు చింతపండు, అరకప్పు కొబ్బరి తురుము, పసుపు వేసి కాస్త నీళ్లు జోడించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
తరువాత స్టవ్ పైన కళాయి పెట్టి నూనె వేసుకొని రెండు.. ఉల్లిపాయలను సన్నగా తరుగుకొని, 2 పచ్చిమిర్చిని నిలువుగా కోసి వేయించుకోవాలి.
అలానే కొద్దిగా అల్లం, వెల్లుల్లి బరకగా దంచుకొని ఆ మిశ్రమాన్ని అందులో వేసుకొని ఈ మొత్తాన్ని మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్టులో వేసి కలుపుకోవాలి.
ఇందులోనే అరకప్పు కొబ్బరి పాలను, కాస్త నీటిని వేసి ఉడికిచ్చుకుంటూ అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలను వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని 20 నిమిషాల పాటు ఉడికిస్తే చేపలు ఉడికిపోతాయి.
ఇలా చేసుకున్న చాపల పులుసుని అన్నంలో వేసుకుని తింటే.. వారేవా అనిపించక మానదు.