Methi Paneer Masala: మేతి పనీర్ మసాలా..ఇలా చేస్తే అన్నం, చపాతీ, పూరీలోకి అదిరిపోద్ది

';

కావాల్సిన పదార్థాలు

నూనె-3 టేబుల్ స్పూన్స్, 1 1/2 కప్పుల మెంతి ఆకులు, 2-కప్పుల పనీర్ క్యూబ్స్, ఎండు మిరపకాయలు, ఏలాకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా గుజ్జు, తాజా క్రీమ్ కొత్తిమీర

';

మసాల పేస్టుకు

కప్పు పెరుగు, కశ్మీరి కారం, పసుపు, మిరపపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చాటా మసాలా

';

తయారీ విధానం

నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు మెంతి ఆకులు వేసి సన్నని మంట మీద 4-5 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.

';

మరో పాన్

ఇప్పుడు మరోపాన్ తీసుకుని అందులో మిగిలిన నూనె పోసి వేడి కారం, యాలకులు, దాల్చినచెక్క, జీలకర్ర వేసి కొంత సేపు వేయించాలి.

';

ఉల్లిపాయలు

ఇప్పుడు అందులో సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు వేసి 2-3 నిమిషాలు వేయించాలి. తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.

';

టమాటో గుజ్జు

ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటో గుజ్జు అందులో వేసి మగ్గనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్టు వేసి నూనె బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి.

';

మెంతి ఆకులు

ఇప్పుడు అందులో ముందుగా వేయించి పక్కన పెట్టిన మెంతి ఆకులను వేయాలి. వీటితోపాటు పనీర్ ముక్కలు , సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

';

1 కప్పు నీళ్లు

ఇప్పుడు అందులో కప్పు నీళ్లు పోసి స్టౌ సిమ్ లో పెట్టాలి. 8-10 నిమిషాలు ఉడికించాలి.

';

కొత్తిమీరతో

అంతే సింపులో మేతీ పన్నీర్ మసాల రెడీ. పైన కొత్తీమీర చల్లి వేడివేడిగా చపాతీ, అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. మీరూ ట్రై చేయండి.

';

VIEW ALL

Read Next Story