మిల్లెట్స్ రవ్వ ఉప్మా.. గోధుమ ఉప్మా కంటే లాభాలు మెండు..

Dharmaraju Dhurishetty
Jul 05,2024
';

మిల్లెట్స్ ఉప్మా క్రమం తప్పకుండా అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ఈ ఉప్మాలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

';

ముఖ్యంగా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు ఈ ఉప్మా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

మిల్లెట్స్ ఉప్మాకి కావలసిన పదార్థాలు: మిల్లెట్స్ - 1/2 కప్పు, నెయ్యి - 2 టీస్పూన్లు, పచ్చిశెనగ పప్పు - 1 టీస్పూన్, మినపప్పు - 1 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్, ఉల్లిపాయ - 1 (తరిగినది), పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి)

';

కావలసిన పదార్థాలు: అల్లం ముక్క - 1 (తరిగినది), కరివేపాకులు, క్యారెట్ - 1 (తరిగినది), బీన్స్, పచ్చిబఠాణీలు - 1/2 కప్పు

';

కావలసిన పదార్థాలు: టొమాటో - 1 (తరిగినది), ఉప్పు, పసుపు - 1/4 టీస్పూన్, నీళ్లు - 1 1/2 కప్పులు

';

తయారుచేసే విధానం: ఈ రెసిపీని తయారు చేయడానికి మిల్లెట్స్‌ రవ్వను 15 నిమిషాలపాటు నీళ్ళల్లో నానబెట్టాలి.

';

ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి అందులో తాలింపుకు పచ్చిశెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.

';

ఆవాలు చిటపటలాడిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకులు వేసి వేయించాలి.

';

ఆ తరువాత క్యారెట్లు, బీన్స్, పచ్చిబఠాణీలు, టొమాటోలు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి.

';

ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి, కడాయికి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.

';

మిల్లెట్స్‌ రవ్వను నీళ్ళ నుంచి తీసి, కడాయిలో వేసి బాగా కలపాలి. మిల్లెట్స్‌ మెత్తబడే వరకు ఉడికించాలి.

';

ఉప్మా సిద్ధం అయిన తర్వాత, కొత్తిమీర తురుము వేసి సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story