Viral fevers : పంజా విసురుస్తున్న విష జ్వరాలు .. ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాల్సిందే

Bhoomi
Aug 27,2024
';

విష జ్వరాలు

తెలుగు రాష్ట్రాల్లో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా చికున్ గున్యా, డెంగీ, రోటోవైరస్, నోరోవైరస్ తోపాటు పలు రకాల వ్యాధులు కొరలు చాచుతున్నాయి.

';

విజృంభిస్తున్న విషజ్వరాలు

వర్షాకాలం సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ లక్షణాలు ఉంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

';

చికున్ గున్యా

ఉన్నట్లుండి తీవ్రం జ్వరం, మోకాళ్లు, మోచేతుల్లో విపరీతమైన నొప్పి. తలనొప్పి, కండరాల నొప్పి, ఒంటిపై దద్దుర్లు వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇవి చికున్ గున్యా లక్షణాలు.

';

డెంగీ

డెంగీ దోమల ద్వారా వ్యాపిస్తుంది. విపరీతమైన తలనొప్పి, కంతల్లో నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాలు నొప్పులు, ఒంటిపై దద్దుర్లు ఇవన్నీ కూడా డెంగీ లక్షణాలు

';

కోవిడ్ వైరస్

కోవిడ్ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ అక్కడక్కడా కేసులు నమోదు అవుతున్నాయి. జ్వరం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, గొంతునొప్పి, ముక్కులో నుంచి నీరు కారడం ఇవన్నీ కూడా కోవిడ్ లక్షణాలే

';

రోటో వైరస్

ఈ వైరస్ ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, డీ హైడ్రేషన్. ఇవన్నీ కూడా రోటో వైరస్ లక్షణాలు. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.

';

నోరో వైరస్

విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, జ్వరం, తలనొప్పి నీరసం ఇవన్నీ కూడా నోరో వైరస్ లక్షణాలు

';

ఇమ్యూనిటి

వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధకశక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, పోషకాలు పుష్కలంగా ఉన్నఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

';

విటమిన్స్

మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా విటమిన్ డి, సి, అల్లంవెల్లుల్లి, పసుపు, ఒమేగా -3 ఫాటీ యాసిడ్స్ వంటి తీసుకోవాలి. డెంగీ లక్షణాలు ఉంటే వైద్యుల సలహాతో బొప్పాయి ఆకుల రసం తీసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story