రాజ్మాగింజలు అంటే అందరికీ తెలుసు. ఇవి ముదురు ఎరుపు రంగులో పెద్దగా ఉంటాయి. కిడ్నీ ఆకారంలో ఉంటాయి. వీటిని కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు. ఇవి ఉడకాలంటే చాలా సమయం తీసుకుంటుంది.
రాజ్మాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాపర్, ఫొలేట్, మెగ్నీషియం, కాల్షియం, మిటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. శాఖాహారాలకు రాజ్మా బెస్ట్ ఫుడ్. చికెన్ , మటన్ లో కంటే ఎక్కువ పోషకాలు ఇందులో ఉంటాయి.
రాజ్మాను డైట్లో చేర్చుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.
రాజ్మాలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా ఆహారంలో చేర్చుకుంటే గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
రాజ్మాలు పొట్ట సంబంధిత వ్యాధులకు చెక్ పెడతాయి. ఫలితంగా పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
బరువు తగ్గాలనుకునేవారికి రాజ్మా మంచి ఆహారం. ఇవి తింటే బరువు తగ్గుతారు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో రాజ్మా చక్కగా పనిచేస్తాయి.
టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వ్యక్తులు మూడు నెలలపాటు రాజ్మా తీసుకుంటే ఎంతగానో ఉపయోగపడుతుంది.
రాజ్మాలోని ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు, ఇతర యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ప్రమాదాన్ని తగ్గిస్తాయి.