రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. అసలు మిస్ అవ్వద్దు..
బచ్చలి కూరలో యాంటీ యాక్సిడెంట్స్.. కార్బో హైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతోంది.
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలుతో పాటు రాస్ప్‌బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.
బాదం, వాల్‌నట్‌లు,గుమ్మడి గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌లను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి.
అవకాడో లో ఉండే కార్బోహైడ్రేట్ల మన జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తోంది. దీంతో మన రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గే అవకాశాలున్నాయి. ఫైబర్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన అవకాడో తో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎంతో దోహదం చేస్తాయి. చియా విత్తనాలు ఈ మసాలా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను నార్మల్ గా చేస్తోంది. అంతేకాదు ఇది ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తోంది.
దీంతో పాటు వివిధ కాలాల్లో దొరికే పండ్లను విరివిగా తినడం వల్ల మన రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులోకి ఉంచుతాయి. కాబట్టి కాలానుగుణంగా దొరికే పండ్లను, కూరగాయాలను తినడం మేలు.
ఏదైనా ఫుడ్స్ తీసుకునే ముందు వైద్యుల సలహాలను తీసుకోవడం మంచిది. ఈ కంటెంట్ ఇంటర్నెట్ లో ఉన్న సమాచారాన్ని మాత్రమే మేము ఇచ్చాము. ZEE Media దీన్ని ధృవీకరించడం లేదు.