చాలా మంది బొప్పాయి తిని గింజలను పారేస్తారు, కానీ అలా చేయడం పూర్తిగా తప్పు.
బొప్పాయితో పాటు దాని గింజలు కూడా చాలా శరీరానికి పోషకాలను ఇస్తాయి. ఈ గింజల్లో మెగ్నీషియం, ఫాస్పరస్, ప్రోటీన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
మీ జీర్ణక్రియ బాగుండాలంటే బొప్పాయి గింజలు తినడం శ్రేయస్కరమని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి గింజలు ఉదర సమస్యలను నయం చేయడమే కాకుండా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
జలుబు మరియు అనేక ఇతర వైరల్ వ్యాధులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే బొప్పాయి గింజలు తినడం మంచిది.