ప్రధాని నరేంద్ర మోదీ తన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహిస్తారు. ముఖ్యంగా ఆయన పనితీరుకు తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకుంటారు.
ప్రధాని మోదీ డైట్ లో కార్బోహైడ్రేట్ల కన్నా కూడా ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇష్టపడతారు.
మోదీ గుజరాతి స్టైల్ లో ఉండే ఆహారాన్ని తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
ప్రధాని మోడీ తన బిజీ షెడ్యూల్ మధ్య డైట్ లో సూపు తీసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ సూపును గ్రీన్ వెజిటేబుల్ సూప్ అని కూడా పిలుస్తారు.
ఈ వెజిటబుల్ సూప్ లో మునక్కాయ ముక్కలను వాడుతారు. మునక్కాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ములక్కాడలు శరీరంలో ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణ క్రమంగా జరిపేందుకు దోహదపడతాయి.
ప్రధాని మోడీ తీసుకునే ములక్కాడ సూపులో పప్పు ధాన్యాలు కూడా ఉంటాయి. అలాగే రుచికి తగినంతగా సైంధవ లవణం వాడుతారు.
ఫైబర్ పుష్కలంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే పొట్టలో కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇష్టంగా తాగే గ్రీన్ వెజిటబుల్స్ సూపు.. మీరు తీసుకుంటే.. పొట్ట కొవ్వును తగ్గించుకోవచ్చు