పాలక్ ఎగ్ బుజ్జి.. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ప్రోటీన్ పుష్కలంగా లభించే ఈ ఐటమ్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం..
ముందుగా ఒక కడాయిలో.. మూడు స్పూన్ల నూనె వేడి చేసుకోండి. అందులో మూడు పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోండి.
ఉల్లిపాయలు మగ్గిన తర్వాత.. ఒక కట్ట పాలకూరను.. సన్నగా కట్ చేసుకుని అందులో వేయండి.
పాలకూర కూడా వేగిన తరువాత.. రుచికి తగినంత ఉప్పు.. హాఫ్ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం.. వేసుకొని కలుపుకోండి.
ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత.. నాలుగు కోడిగుడ్లను అందులో వేయండి.
కోడుగుడ్లను కదపకుండా.. కొంచెం సేపు వదిలేయండి.
గుడ్లు కొంచెం మగ్గిన తర్వాత దాన్ని కలపండి.. ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయండి.. అంతే పాలక్ ఎగ్ బుజ్జి రెడీ