Ragi Pakoda: అన్ని వ్యాధుల వారు తినే రాగి పిండి పకోడా స్నాక్ రెసిపీ..

';

రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

';

చాలామంది రాగి పిండితో జావా, రోటీలు తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఈ పిండితో తయారు చేసిన పకోడాను తిన్నారా?

';

రాగి పిండితో తయారుచేసిన పకోడా అని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అన్ని వ్యాధులతో బాధపడేవారు ఈ దీనిని తినవచ్చు.

';

రాగి పిండితో పకోడాని ఎలా తయారు చేసుకోవాలో? దానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి..

';

రాగి పిండి పకోడాకి కావలసిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (తరిగినది), కరివేపాకు - 1 రెమ్మ, పచ్చిమిరపకాయలు - 2-3 (తరిగినవి), అల్లం - 1/2 అంగుళం (తరిగినది), వెల్లుల్లి - 2 రెబ్బలు (తరిగినవి)

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర - 1/2 టీస్పూన్, పసుపు - 1/4 టీస్పూన్, కారం - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి

';

తయారీ విధానం: ఒక గిన్నెలో రాగి పిండి, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

కొద్ది కొద్దిగా నీరు పోస్తూ, గట్టిగా లేకుండా, పలచగా లేకుండా పిండిని కలుపుకోవాలి.

';

ఒక పాన్ లో నూనె వేడి చేసి, పిండిని పకోడాలగా వేసి, బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.

';

వేడి వేడిగా, మీకు ఇష్టమైన చట్నీతో కలిసి సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story