శరీరానికి ఎంతో శక్తినిచ్చే సేమ్యా పాయసం..

Dharmaraju Dhurishetty
Jul 30,2024
';

పిల్లలకు క్రమం తప్పకుండా రాగి సేమ్యా పాయసాన్ని ఇవ్వడం వల్ల మంచి శక్తిని పొందుతారు.

';

ఈ రాగి సేమ్యా పాయసంలో ఉండే పోషకాలు శరీరానికి బోలెడు లాభాలను అందిస్తాయి.

';

ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు జీర్ణక్రియను ఆరోగ్యం ఉంచుతాయి.

';

అయితే మీరు కూడా ఇంట్లోనే రాగి సేమ్యా పాయసంను ట్రై చేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

రాగి సేమ్యా పాయసానికి కావాల్సిన పదార్థాలు: రాగి సేమియా - 1 కప్పు, పాలు - 2 కప్పులు, చక్కెర - 1/2 కప్పు, కొబ్బరి పొడి - 2 టేబుల్ స్పూన్లు

';

కావాల్సిన పదార్థాలు: నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 1/4 కప్పు, ఎండుద్రాక్ష - 1/4 కప్పు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్

';

తయారీ విధానం: ముందుగా ఈ రాగి సేమ్యా పాయసాన్ని రెడీ చేసుకోవడానికి ఓ పెద్ద బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ బౌల్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, ఎండుద్రాక్షను వేయించి పక్కన పెట్టుకోండి.

';

అదే పాత్రలో రాగి సేమియా వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

ఆ తర్వాత అందులోనే పాలు పోసి, చక్కెర కలిపి బాగా ఉడకబెట్టాలి.

';

ఇలా అన్ని వేసుకున్న పాయసం చిక్కబడే వరకు ఉడికించాలి.

';

అందులోనే యాలకుల పొడి, కొబ్బరి పొడి, వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి బాగా కలపాలి.

';

కావాలనుకుంటే ఇందులో ఫ్రూట్స్‌ను కలుపుకుని తినొచ్చు. ఇలా క్రమం తప్పకుండా తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story