Red Chilli Chicken: రెడ్‌ చిల్లీ చికెన్‌.. ఇలా వండితే రెస్టారెంట్‌ కంటే సూపర్‌..

Renuka Godugu
Sep 27,2024
';

చికెన్‌ శుభ్రం చేసి ఒక గుడ్డు, ఉప్పు, తెల్లి మిరియాల పొడి రెండు టీస్పూన్ల కార్న్‌ ఫ్లోర్‌, మైదా కూడా వేసుకోవాలి.

';

వీటిని బాగా కలపాలి. ఆ తర్వాత చికెన్‌ ముక్కలను ఆయిల్‌ బాగా వేడి చేసి అందులో వేయించుకోవాలి.

';

కాసేపయ్యాక మరోవైపు తిప్పి రంగు మారేవరకు మీడియం మంటపై వేయించుకోవాలి.

';

మరో బాండీ తీసుకని రెండు స్పూన్ల ఆయిల్‌ వేసి అందులో కట్‌ చేపిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి ఎక్కువ మంటపై వేయించాలి.

';

వీటి రంగు మారే వరకు ఎక్కువ మంటపై వేయించాలి. ఆ తర్వాత కట్‌ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించాలి.

';

ఆ తర్వాత రెండు గ్లాసులు నీళ్లు పోసి కారం, మిరియాల పొడి, టమాటా కెచప్‌, రెడ్‌ చిల్లీ సాస్‌, కాస్త ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఈ సమయంలో ఫుడ్‌ కలర్‌ కూడా వేసుకోవచ్చు

';

కాస్త చిక్కబడిన తర్వాత వేయించిన చికెన్‌ ముక్కలు కూడా వేసి బాగా పట్టేలా టాస్‌ చేయండి.

';

చివరగా జీడిపప్పు వేసి బాగా కలుపుతూ ఉండాలి. కొత్తిమీరాతో గార్నిష్‌ చేసి పైనుంచి నిమ్మరసం పిండుకోవాలి.

';

VIEW ALL

Read Next Story