సగ్గుబియ్యం వడ.. ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు ఇంకా..

Dharmaraju Dhurishetty
Aug 04,2024
';

వడలను చాలామంది మినపపప్పుతో తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే వీటిని రోజు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. ఇలాంటి వారి కోసం సగ్గుబియ్యంతో వడలు వేసి దీన్ని పరిచయం చేయబోతున్నాం..

';

వడలను వివిధ రకాలుగా వివిధ పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు. చాలామంది వివిధ సైజుల్లో కూడా తయారు చేసుకుంటారు.

';

నిజానికి సగ్గుబియ్యంతో తయారు చేసిన వడలను చిన్న సైజుల్లో తయారు చేసుకొని తినడం వల్ల అద్భుతమైన టేస్ట్ పొందుతారు.

';

ఉదయం పూట టిఫిన్‌గా లేదా స్నాక్స్‌గా కూడా ఈ సగ్గుబియ్యం వడలను తినొచ్చు. వీటిని మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ పద్ధతి అనుసరించండి.

';

సగ్గుబియ్యం వడలకు కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (తరిగినది), కొత్తిమీర - 1/2 కట్ట (తరిగినది)

';

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి - 2-3 (తరిగినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్, ధనియాల పొడి - 1/2 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: మిరపకాయ పొడి - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి, తరిగిన అల్లం ముక్కలు, కాస్త మినప పిండి

';

సగ్గుబియ్యం వడ తయారీ విధానం: ఈ వడలను తయారు చేసుకోవడానికి ముందుగా సగ్గుబియ్యంను 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి.

';

నానబెట్టిన సగ్గుబియ్యంను నీటి నుండి తీసి, బాగా పిండి వేసి, పదినిమిషాల పాటు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక గిన్నెలో ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరపకాయ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

చివరగా అన్ని పదార్థాలను పిండిలో మిక్స్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి.

';

ఒక పాన్ లో నూనె వేడి చేసి, చిన్న చిన్న వడలుగా వేసుకొని గోధుమ రంగు వచ్చేంతవరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయించుకొని పక్కన తీసుకుంటే అంతే సగ్గుబియ్యం వడా రెడీ అయినట్లే..

';

చిట్కా..సగ్గుబియ్యాన్ని ఎక్కువ సేపు నానబెట్టడం వల్ల వడలు మరింత మృదువుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

వడలను వేయించుకునే క్రమంలో నూనె ఎక్కువగా వేడి ఉండకుండా చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువగా నూనె ఉంటే పై పొర మాత్రమే కాలి.. లోపల పిండిలా ఉండే అవకాశాలున్నా.

';

VIEW ALL

Read Next Story