హెల్తీ బాల్స్ రెసిపీ.. రోజు తింటే మలబద్ధకానికి చెక్!

Dharmaraju Dhurishetty
Jan 03,2025
';

ఆవిరితో చేసిన కార్న్ బాల్స్ రెసిపీని పిల్లలకు స్నాక్‌గా ఇవ్వడం వల్ల బోలెడు ప్రయోజనాలు పొందుతారు.

';

స్వీట్‌ కార్న్‌లో శరీరానికి కావాల్సిన ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది.

';

ముఖ్యంగా మలబద్ధకం, తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ బాల్స్‌ తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

';

అలాగే కార్న్ బాల్స్‌లో వివిధ రకాల పోషకాలు కూడా లభిస్తాయి. కాబట్టి రోజు తినడం చాలా మంచిది.

';

కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ - 1 కప్పు (ఉడికించిన), బంగాళాదుంప - 1 (ఉడికించిన), మోజరెల్లా చీజ్ - 100 గ్రాములు, ఉల్లిపాయ - 1 (తరిగిన), పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగిన)

';

కావలసిన పదార్థాలు: అల్లం ముక్క - 1 (చిన్నగా తరిగిన), తరిగిన కొత్తిమీర, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - రుచికి తగినంత

';

కావలసిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ క్రంబ్స్ - 1/4 కప్పు, ఆవిరి వేయడానికి ఇడ్లీ కుండ లేదా స్టీమర్

';

తయారీ విధానం: ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో ఉడికించిన స్వీట్ కార్న్, తురిమిన బంగాళాదుంపలను వేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత తురిమిన చీజ్, తరిగిన ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ వేసుకుని కూడా బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా కలిపి అన్నింటి మిశ్రమంలా తయారు చేసుకుని.. బాగా గ్రైండ్‌ చేసి మిశ్రమంలా తయారు చేసుకోండి.

';

ఇలా చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని బ్రెడ్ క్రంబ్స్ లో వేసి రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఇడ్లీ కుక్కర్‌లో లేదా స్టీమర్‌లో వేసుకుని బాగా స్ట్రీమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కార్న్ బాల్స్‌ రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story