గుడ్డు వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..మరి అలాంటి కోడిగుడ్డుతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం..
ముందుగా 5 గుడ్లు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని.. మూడు స్పూన్ల నూనె వేడి చేసుకోండి.
అందులో కొద్దిగా ఆవాలు..జీలకర్ర..మెంతులు వేసుకుని.. ఒక రెండు, మూడు ఉల్లిపాయలను అడ్డంగా తరుక్కుని వేసుకోండి.
ఆ తరువాత ఉల్లిపాయలు.. గోధుమ రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకుని.. అందులో నాలుగు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయండి.
టమాటాలు బాగా మగ్గిన తర్వాత.. నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని.. వేసి రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరగనివ్వండి
చివరిగా ఈ మిశ్రమంలో ముందుగా ఉడకపెట్టిన కోడిగుడ్లను వేసుకొంది.
నూనె పైకి వచ్చేవరకు ఈ మిశ్రమాన్ని.. ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన.. గుడ్డు పులుసు రెడీ.