కొన్ని అలవాట్లతో వృద్ధాప్యం అనేది త్వరగా వస్తుంటుంది. ఈ చిట్కాలతో వృద్ధాప్యం త్వరగా నిత్య యవ్వనంగా ఉంటారు.
నిత్య యవ్వనం కోసం ఈ అలవాట్లను నివారించండి
నిద్ర లేకపోవడం వృద్ధాప్యానికి దారి తీస్తుంది. నిద్ర లేక చర్మం మొద్దబారుతుంది. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. సరైన నిద్రపోవాలి.
మద్యం తాగే అలవాటు ఉన్నవారికి వృద్ధాప్యం త్వరగా వస్తుంది. మద్యం సేవిస్తే చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. మంటను కలిగిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మద్యం వలన అకాల ముడతలు, చర్మపు నిగారింపు కోల్పోతారు.
సిగరెట్, మాదకద్రవ్యాల వినియోగం వృద్ధాప్యాన్ని త్వరగా ఆహ్వానిస్తుంది. ధూమపానం కొల్లాజెన్, ఎలాస్టిన్‌ను దెబ్బతీస్తుంది. ఇది చర్మం ముడతలు రావడం.. కుంగిపోవడానికి దారి తీస్తుంది. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. చర్మానికి ఆక్సిజన్, పోషకాలను అందకుండా చ
శరీరానికి పని చెప్పాలి. లేకుంటే మొద్దుబారి డల్‌నెస్‌కు కారణమవుతుంది. బాడీకి పని చెప్పకపోతే చురుకుదనం కోల్పోయి వృద్ధాప్యం త్వరగా పొందుతారు. శ్రమ లేకుంటే మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా పొంచి ఉంది.
తగినంత నీరు తీసుకోకుంటే వృద్ధాప్యం కూడా వస్తుంది. నీరు తగినంత తీసుకోకపోతే చర్మ సౌందర్యం కోల్పోతాం. చర్మం పొడిగా మారి ముడతలు ఏర్పడటానికి ప్రోత్సహిస్తుంది.
శారీరక, మానసిక ఒత్తిడి వృద్ధాప్యానికి దారి తీస్తుంది. ఒత్తిడి కార్టిసాల్ ఉత్పత్తిని పెంచడం ద్వారా శరీరంలో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతమవుతుంది. ఒత్తిడి సెల్యులార్ దెబ్బ తినడానికి దారితీస్తుంది.
సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే వృద్ధాప్యం త్వరగా వస్తుంది. సమతుల ఆహారం తీసుకోకపోవడం వలన శరీరానికి అవసరమైన పోషకాలను అందకుండా చేస్తాయి. చర్మం వృద్ధాప్యం, నీరసం, ముడతలు రావడానికి దారి తీస్తాయి.
సూర్యరశ్మికి గురికావడంతో సూర్యుని యూవీ కిరణాలు మీ శరీర చర్మానికి హాని కలిగిస్తాయి. ఇది ముడతలు, కుంగిపోయే అవకాశం ఉంది.