ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ రైస్ చిటికలో చేసుకోవచ్చని మీకు తెలుసా. మరి ఈ రైస్ తయారీ విధానం మీకోసం
ముందుగా కాలీఫ్లవర్ ని బాగా కడుక్కొని.. మిక్సీలో కచ్చాపచ్చాగా వేసుకొని పక్కన పెట్టుకోండి.
ఆ తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేసి అందులో ఆ కాలీఫ్లవర్ మిశ్రమాన్ని ఏడు నిమిషాలు చిన్న మంట మీద రోస్ట్ చేయాలి.
ఈ మిశ్రమంలో తరిగిన 3 వెల్లుల్లి, తరిగిన కొద్ది ఉల్లికాడలు, అర కప్పు పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి
ఇవన్నీ వేగుతున్నప్పుడే 1 క్యాప్సికం, 5 బేబీ కార్న్‌లను తరిగి వేసుకోవాలి
ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, కారం చల్లి వీటన్నింటిని పచ్చివాసన పోసే పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
చివరిగా కొద్దిగా మిరియాల పొడి చల్లుకొని ఇవి.. ఈ మిశ్రమం మొత్తం ఆవిరిపోయి ఫ్రై లాగా అయ్యే వరకు వేయించాలి.
పైన అర స్పూన్ సోయా సాస్‌ను వేసుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించుకున్న అన్నం చేసి ఓసారి కలుపుకోవాలి.
ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర తరుగు.. చల్లుకుంటే ఎంతో రుచికరమైన కాలిఫ్లవర్ రైస్ రెడీ..