కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో ఎన్నో రకాల స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎగ్ మంచూరియా ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ పదార్థాన్ని హోటల్ లో కాకుండా ఇంట్లో మీరే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.
ఎగ్ మంచూరియా కోసం కావాల్సిన పదార్థాలు నూనె - తగినంత, 5 గుడ్లు, మొక్కజొన్న పిండి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయలు 3 రెబ్బలు, అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1, ఉల్లిపాయ సగం, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు.
వీటితోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 tsp, టొమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/4 tsp, మైదా 1/4 కప్పు.
ముందుగా గుడ్లను ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత చన్నీటిలో వేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
ఒక్కో గుడ్డును ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి, మైదా, మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసి.. కొంచెం నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమం లో గుడ్డు ముక్కలను వేసి.. పిండి బాగా పట్టేలాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, నూనె వేసి, అది వేడయ్యాక కోడిగుడ్డు ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండి పెట్టి 1 టేబుల్‌స్పూన్ నూనె వేసి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వేసి రంగు బాగా మారే వరకు వేయించాలి.
తరువాత సోయాసాస్, చిల్లీ సాస్ కూడా వేసి బాగా కలపండి. 2 నిమిషాల తర్వాత నీళ్లలో కరిగిన మొక్కజొన్న పిండి పోసి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
చివరగా వేయించుకున్న గుడ్డు ముక్కలు వేసి కలపాలి. రుచికి తగ్గట్టు కొంచెం మిరియాల పొడి చల్లుకుంటే ఎగ్ మంచూరియన్ రెడీ.