చలికాలంలో ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్ లో శరీరానికి వెచ్చదనం, ఎముకలకు బలం అవసరం. జీడిపప్పు తింటే ఎముకలు బలంగా ఉంటాయి.
కొత్తిమీర, టమాటా చట్నీ గురించి మీరు వినే ఉంటారు. అయితే జీడిపప్పు చట్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని తయారు చేసేందుకు కొత్తమీర, పచ్చిమిర్చి, అల్లం, నిమ్మకాయలతో పాటు వేయించిన జీడిపప్పు అవసరం.
జీడిపప్పు ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. మీరు జీడిపప్పుతో స్మూతీ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ రుచికరమైన స్మూతీని బాదం, జీడిపప్పు, వాల్నట్స్ , అరటిపండు, పెరుగుతో కలిపి తయారు చేయాలి.
రాత్రి పడుకునే ముందు జీడిపప్పు పాలు తాగాలి. దీన్ని చేయడానికి కొన్ని జీడిపప్పులను రాత్రి నానబెట్టి ఉదయం అందులో క్రీముపాలతో రెడీ చేసుకోవాలి.
జీడిపప్పు సలాడన్ ఆలివ్ నూనె, నిమ్మకాయ, నల్ల ఉప్పు, కొద్దిగా వెల్లుల్లితో తయారు చేసుకోవాలి. దీన్ని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.
జీడిపప్పుతో తయారు చేసిన పట్టీలు మార్కెట్లో చాలా దొరుకుతాయి. మీరు ఇంట్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. జీడిపప్పు, ఖర్జూరం, తాజాపండ్లు, ఓట్స్ కలిపి దీన్ని తయారు చేస్తారు.
చలికాలంలో ప్రజలు పలు రకాల హల్వాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. జీడిపప్పుతో రుచికరమైన హల్వాను తయారు చేయవచ్చు. దీని తయారీకి పాలు, నెయ్యి, బెల్లం వాడుతుంటారు.
మీకు ఇష్టమైన మసాల కూరలో వేయించిన జీడిపప్పును చేర్చుకుంటే రెట్టింపు రుచి ఉంటుంది.
ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందించాము. వీటిని ప్రయత్నించే ముందు మీరు వైద్యులను సంప్రదించడమే ఉత్తమం