గొంతులో చికాకు లేదా గరగర సమస్య వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. తినలేక, మాట్లాడలేక, మింగలేక ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.
గొంతులో చికాకు పెడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు.జలుబు, జ్వరం, అలర్జీ, కాలుష్యం, పొగ వల్ల కూడా కావచ్చు. గొంతు సమస్య నుంచి బయటపడేందుకు ఈసింపుల్ హోం రెమెడీస్ ప్రయత్నించండి.
ఎన్నో సమస్యలకు తేనె దివ్యౌషధం. గొంతు చికాకు నుంచి ఉపశమనం పొందేందుకు తేనెను సహాజ పదార్థాలతో కలిపి తినవచ్చు. ఇన్ఫెక్షన్ తో పోరాడి నొప్పిని తగ్గిస్తుంది.
ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. గొంతు నొప్పి లేదా జలుబు, ఫ్లూ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీర్ఘకాలిక ఫ్లూ లక్షణాలు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
తులసిలో యాంటీ ఇన్ల్ఫమేటర, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. తులసి టీ కానీ కషాయం కానీ తాగితే ఉపశమనం ఉంటుంది.
కొన్నిసార్లు దీర్ఘకాలిక గొంతు నొప్పి అనేక వ్యాధులకు కారణం అవుతుంది. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం బెటర్.