మన భారత దేశంలో చూడచక్కని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విదేశాల నుంచి సైతం మన భారతదేశానికి ఎంతో మంది సందర్శకులు వస్తూ ఉంటారు.
ఈ క్రమంలో మన భారత దేశంలోని రైల్వే స్టేషన్లు కూడా కొన్ని ఎంతో అద్భుతంగా ఉంటాయని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే. మరి మన భారత దేశంలో ఉండే అద్భుతమైన రైల్వే స్టేషన్స్ గురించి తెలుసుకుందాం.
ముంబై రైల్వే స్టేషన్ బయట నుంచి చూడడానికి అచ్చం హోటల్‌లా కనిపిస్తుంది. దాని ముందుభాగం అద్భుతంగా కనిపించడం వల్ల ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఎన్నో సినిమాలను కూడా తీశారు. ముంబై పర్యటనకు వెళితే ఈ స్టేషన్‌కు తప్పక సందర్శించండి.
రాజస్థాన్‌లోని ముందే ఈ రైల్వే స్టేషన్ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్టేషన్ సమీపంలో మరికొన్ని పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి.
చార్‌బాగ్ రైల్వే స్టేషన్ లక్నోలోని పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఈ రైల్వేస్టేషన్ చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తూ అక్కడ పర్యాటకులను అలరిస్తూ ఉంటుంది.
ఈ రైల్వే స్టేషన్ రూపురేఖలు మిగతా రైల్వే స్టేషన్స్ కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ కోట ఆకారంలో ఉంటుంది. ప్రతిరోజూ వేలాది మంది దీనిని సందర్శిస్తారని చెబుతారు.
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో భాగంగా పరిగణించబడే ఘూమ్ రైల్వే స్టేషన్ భారతదేశంలో ఉండే అద్భుతమైన ప్రదేశాలలో ఒకటి. ఈ రైల్వేస్టేషన్ ని చూస్తే మీరు నిజంగానే ఇదేదో వండర్ లాగా ఫీల్ అవుతారు