తెల్ల జుట్టు నల్లగా మారడానికి సహజమైన ఆయుర్వేద మార్గాలు ప్రయత్నించవచ్చు.
ఆముదం నూనె, ఆలివ్ నూనెలు..మూడు రోజులకు ఒక్కటి పెట్టుకోవడంతో.. మీరు నెల రోజుల్లోనే మార్పులు గమనించగలుగుతారు. అంతేకాదు నల్ల జుట్టు కోసం ఆమ్లా పౌడర్ వాడడం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఆమ్లా, కరివేపాకు పౌడర్ ని.. గోరువెచ్చటి నూనె లో కలిపి అప్లై చేస్తే.. జుట్టు నల్లగా మారుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా..ప్రతిరోజూ ఆహారంలో ప్రోటీన్లు విటమిన్ B12 ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది.
జుట్టుకు ఆలోవేరా జెల్.. రెండు వారాలకి ఒకసారి అప్లై చేయడం ద్వారా జుట్టు నల్లగా మారుతుంది.
వారానికి రెండు లేదా మూడు సార్లు పైన చెప్పిన నూనెతో మసాజ్ చేయడం వల్ల, నెలకి రెండుసార్లు అలోవీరా జెల్ అప్లై చేయడం వల్ల.. జుట్టు నల్లగా మారడం మీరు ఒక నెలలోనే గమనించవచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.