పోషహారం లోపంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు పప్పును తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
';
ముఖ్యంగా పెసరపప్పను తినడం వల్ల శరీరానికి పుష్కలంగా ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి.
';
అంతేకాకుండా పెసరపప్పులో ఉండే గుణాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
';
ప్రతి రోజు పెసరపప్పును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
';
బరువు తగ్గడానికి సహాయపడుతుంది: పెసరపప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తుంది. దీంతో అనవసరంగా తినడం తగ్గి బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
';
జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: పెసరపప్పులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
';
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: పెసరపప్పులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
';
గుండె ఆరోగ్యానికి మంచిది: పెసరపప్పులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఫోలేట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
';
ఎముకలను బలపరుస్తుంది: పెసరపప్పులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
';
చర్మాన్ని మెరుగుపరుస్తుంది: పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చర్మాన్ని రక్షిస్తుంది.
';
రక్తహీనతను నివారిస్తుంది: పెసరపప్పులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది.
';
శక్తిని పెంచుతుంది: పెసరపప్పులో కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.