యాపిల్ సైడర్ వెనిగర్ వంటల్లో ఉపయోగిస్తాం. అయితే, దీన్ని హెయిర్ కేర్ రొటీన్లో కూడా వాడవచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్ తలకు రాసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్- 2 tbsp నీరు- 2 tbsp కాటన్ బాల్స్-5
ఒక గిన్నె తీసుకుని అందులో యాపిల్ సైడర్ వెనిగర్, నీరు బాగా కలపండి.
ఆ తర్వాత అందులో కాటన్ బాల్ డిప్ చేసి తల అంతటికీ పట్టించాలి.
ఓ అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ రెమెడీని వారానికి 3 రోజులు చేయండి.
ఈ రెమెడీని ప్రయత్నించే ముందు పాచ్ టెస్ట్ తప్పకుండా చేయండి.