నోటికి రుచిగానే ఉంటు.. బరువును తగ్గించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.. అదే మన ఓట్స్ పాన్ కేక్స్. మరి ఇది..ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం..
ముందుగా ఒక మిక్సర్ జార్ లో.. రెండు కప్పుల ఓట్స్, ఒక చిన్న ముక్క అల్లం, నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి.
అందులోనే..ఒక గుప్పెడు కరేపాకు, రుచికి తగినంత ఉప్పు, ఒక కప్పు నీరు వేసుకొని.. పిండిని రెడీ చేసుకోవాలి.
దానిలో ఒక పెద్ద టమోటా ముక్కలను.. ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను.. ఒక చిన్న కప్పు కొత్తిమీరను వేసి.. బాగా కలుపుకోవాలి.
స్టవ్ మీద ఒక కడాయిలో.. కొంచెం నెయ్యి.. కానీ నూనె కానీ వేసుకొని..దీన్ని పాన్ కేక్స్ మాదిరిగా వేసుకోవాలి.
రెండు పక్కల బాగా ఉడికించుకోవాలి.. అంతే బరువును అదుపులో ఉంచే ఓట్స్ పాన్ కేక్ రెడీ.