బరువు తగ్గాలని అనుకుంటున్నారా.. ముఖ్యంగా పొట్ట దగ్గర మీ కు కొవ్వు పేరుకుపోయిందా? అయితే కాఫీ రోజు ఇలా తాగడం ద్వారా త్వరగా బరువు తగ్గొచ్చు.
ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీలో.. కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగండి.
ఇలా రోజు తాగడం వల్ల.. కొవ్వు తగ్గుతూ వస్తుంది. అలానే రోదనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి, సిత్రిక్ యాసిడ్లు కాఫీలో ఉన్న కేఫైన్ కి తోడవడం వల్ల.. జీర్ణ క్రియ రేటు పెరుగుతుంది.
బుల్లెట్ కాఫీ ద్వారా కూడా మీరు బరువు తగ్గొచ్చు. ఈ కాఫీ కోసం ఒక కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసుకోండి.
అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా కొబ్బరి నూనె వేసుకోండి.
ఈ కాఫీని ఉదయం అల్పాహారం బదులుగా తీసుకుంటే.. మెటబాలిజం రేటు పెరిగి మీరు త్వరగా బరువు తగ్గుతారు.