వాటర్ యాపిల్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉండే వాటర్ యాపిల్, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను తట్టుకునే శక్తిని శరీరానికిస్తుంది.
వాటర్ యాపిల్ లోని ఫైబర్ జీర్ణక్రియను సులువుగా చేసి, మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది.
వేసవిలో వాటర్ యాపిల్ చల్లదనాన్ని ఇచ్చి, శరీర ఉష్ణోగ్రతను నింత్రిస్తుంది. వాటర్ యాపిల్‌లోని ఎక్కువ నీటి శాతం కారణంగా, ఇది వేసవి కాలానికి పర్ఫెక్ట్ ఆహారం.
విటమిన్-ఎ ఉండే వాటర్ యాపిల్ మంచి చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా వాటర్ యాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను నష్టం నుంచి కాపాడి ముడతలను నిరోధించడానికి సహాయపడతాయి.
పొటాషియం అధికంగా ఉండే వాటర్ యాపిల్, కండరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. వర్కవుట్ చేసే వారికి ఎక్కువ శారీరక శ్రమ అనుభవించే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వాటర్ యాపిల్‌లో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా కడుపు నిండుగా అనిపించేలా చేసి, బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.
వాటర్ యాపిల్‌లోని పొటాషియం రక్తపోటును నింత్రించడంలో సహాయపడుతుంది.