యువతలో తెల్ల జుట్టు ఎందుకు వస్తుందో తెలుసా?

Dharmaraju Dhurishetty
Nov 19,2024
';

ప్రస్తుతం భారతదేశంలో 100 మంది యువతలో దాదాపు 60 అయిన తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.

';

చాలామంది తెల్ల జుట్టు నుంచి విముక్తి పొందడానికి విపరీతమైన కెమికల్స్‌తో కూడిన రంగులను వినియోగిస్తున్నారు.

';

నిజానికి తెల్ల జుట్టు ఎందుకు వస్తోంది.. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

';

వయస్సు పెరుగుతున్న వారిలో తెల్ల జుట్టు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కొంతమందిలో మెలనిన్ అనే వర్ణద్రవ్య కోరతవల్ల చిన్న వయసులోనే ఈ సమస్య వస్తుంది.

';

కొంతమందిలోనైతే జన్యుపరంగా కూడా ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు తెల్ల జుట్టు ఉంటే చిన్న వయసులోనే పిల్లలకు కూడా వస్తుందట.

';

విటమిన్ బి12 లోపం కారణంగా కూడా చాలా మందిలో తెల్ల జుట్టు వంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

అలాగే శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడం వల్ల, మానసిక ఒత్తిడి పెరగడం వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంది.

';

ఆటో యూనియన్ డిసార్డర్ కారణంగా కూడా తెల్ల జుట్టు విపరీతంగా పెరుగుతుంది. చిన్న వయసులో రావడానికి ఈ కారణం కూడా ఒకటి.

';

మరికొంతమందిలోనైతే అతిగా ధూమపానం మధ్యపానం చేయడం వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ఇక మరికొంతమందిలోనైతే వాతావరణ కాలుష్యం, ఇతర కారణాల వల్ల కూడా తెల్ల జుట్టు విపరీతంగా పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story