ఎండ ఎక్కువగా తగలదు కాబట్టి.. శీతాకాలంలో మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోవచ్చు అనేది ఎంతో మంది అపోహ.
అందులో నిజం ఉన్నా లేకపోయినా.. సరేనా ఆహారం తీసుకోకపోతే మాత్రం.. శీతాకాలంలో జలుబు, జ్వరం లాంటివి మనల్ని ఎక్కువగా బాధపెడుతూ ఉంటాయి.
మరి శీతాకాలంలో ఆరోగ్యం పదిలంగా ఉండాలి అంటే కింద చెప్పే ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి.
విటమిన్ సి ఉండే ఫుడ్స్ తినడం వల్ల.. మనలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
నట్స్ ముఖ్యంగా వాల్నట్స్ తినడం వల్ల.. ఐరన్, విటమిన్ ఏ లాంటివి మన శరీరానికి అంది.. ఆరోగ్యంగా ఉంచుతాయి.
అవిస గింజలు ఇమ్యూనిటీ పెంచడంలో ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి అవిసగించల నూనె లేకపోతే అవిస గింజలు తినడం వల్ల మన ఆరోగ్యం.. సక్రమంగా ఉంటుంది.