ఆకాశంలో మేఘాలు లేకపోతే భూమి పరిస్థితి ఎలా ఉంటుంది. ఊహకే అందని ప్రశ్న కదా..
నీలాకాశంలో తెల్లటి మేఘాలు అందంగా ఉండటమే కాదు చాలా ప్రయోజనాలు అందిస్తాయి. మరి ఇవి లేకపోతే ఏం జరుగుతుంది.
మేఘాలు వర్షాల్ని తీసుకొస్తాయి. అంతేకాకుండా భూమికి ఇంకా చాలా ప్రయోజనాలు అందిస్తుంటాయి
శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మేఘాలు లేకుంటే భూమిపై జలవాయు, జలచక్రంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. వేడిమి పెరిగిపోతుంది.
మేఘాలు భూమిని సోలార్ రేడియేషన్ నుంచి కాపాడుతుంటాయి. దాంతో సముద్రం, భూమిపై ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంటుంది
ఒకవేళ మేఘాలే లేకపోతే భూమిపై ఉష్ణోగ్రత 22 డిగ్రీల వరకూ పెరిగిపోవచ్చు. దాంతో భూమి మనుగడ ప్రశ్నార్ధకమౌతుంది
మేఘాలే లేకుంటే వర్షాలుండవు. వర్షాల్లేకపోతే నీరు లేక పంటలు పండవు. వృక్ష సంపద కన్పించదు.
మేఘాలు భూమికి కంబలిలా పనిచేస్తాయి. రాత్రి వేళ వేడి పైకి పోకుండా నియంత్రిస్తాయి.
జలవాయు పరిశోధకుల ప్రకారం భూమిపై జలవాయు వేడిమి పెరిగే కొద్దీ చల్లార్చే పని మేఘాలు ప్రారంభిస్తాయి.