Honey Test: ఒకే ఒక్క నిమిషంలో తేనె అసలైందా నకిలీనా అనేది ఇలా తెలుసుకోవచ్చు.

Md. Abdul Rehaman
Aug 13,2024
';


ఇటీవలి కాలంలో తినే ఆహార పదార్ధాలు అన్ని నకిలీ అవుతున్నాయి. ఏది నకిలీ ఏది అసలు అనేది తెలుసుకోవడం కష్టమౌతుంది. దాంతో ఆరోగ్యపరంగా హాని కలుగుతోంది

';


అదే విదంగా ఆరోగ్యానికి ఔషధంగా భావించే తేనె కూడా నకిలీ లభిస్తోంది. తేనె అసలైందా లేక నకిలీ అనేది తెలుసుకునేందుకు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి.

';

వాటర్ టెస్ట్

కొద్దిగా తేనె నీళ్లలో వేయాలి. ఒకవేళ తేనె పూర్తిగా నీటి గిన్నెలో అలాగే ఉంటే అసలైందని అర్ధం. నీళ్లలో కరిగిపోతే మాత్రం నకిలీ అని అర్ధం

';

పేపర్ టెస్ట్

తేనె డ్రాప్స్ కొన్ని ఓ కాగితంపై వేయాలి. కాగితంపై తేనె ఎలాంటిది అలాగే ఉంటే అసలైంది. కాగితం పీల్చుకుంటే మాత్రం నకిలీ అని అర్ధం

';

ఫైర్ టెస్ట్

ఓ వెదురు కర్రకు దూది చుట్టి అందులో తేనె వేయాలి. ఇప్పుడు నిప్పు అంటిస్తే తేనె అసలైంది అయితే వెంటనే మండుతుంది. నకిలీ అయితే కొద్దిగా టైమ్ పడుతుంది

';

ఫింగర్ టెస్ట్

తేనెను బొటనవేలిపై ఉంచాలి. చూపుడువేలితో సన్నగా తాడులా చేసేందుకు ప్రయత్నించాలి. తేనె అసలైంది అయితే లావుగా, నకిలీ అయితే సన్నగా వస్తుంది

';

బ్రెడ్ టెస్ట్

బ్రెడ్ ముక్కపై తేనే రాయాలి. అలా 5 నిమిషాలు వదిలేయాలి. తేనె బ్రెడ్ ముక్కను మెత్తగా లేదా తడిగా మార్చిందంటే నకిలీ అని అర్దం. బ్రెడ్ ఏం మారకుండా ఉంటే తేనె అసలైంది

';


ఈ ట్రిక్స్ సహాయంతో తేనె అసలైందా లేదా అనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story