శ్రీరాముడిని హనుమంతుడు ఆయన గుండెలలో నిలుపుకున్నాడు.
ఒక్క నిముషం కూడా ఆంజనేయుడు రామనామం జపంచేయడం ఆపడు
ఆంజనేయుడు ఆ జన్మ బ్రహ్మచారి అని రామయణంలో చెబుతుంటారు.
కానీ ఆంజనేయుడు కూడా ఒకనొకప్పుడు పెళ్లిచేసుకున్నాడంట.
హనుమ తన గురువైన సూర్యుడి దగ్గర అనేక విద్యలను అభ్యసిస్తాడు
సూర్యుడు హనుమకు 9 ప్రధాన విద్యలను బోధించడం జరుగుతుంది.
ఒక నాలుగు విద్యలను మాత్రం సూర్యుడు పెళ్లైన వారికే బోధిస్తారని చెప్తాడంట
దీంతో విద్య నేర్చుకోవాలని ఆసక్తితో హనుమ పెళ్లికి అంగీకరిస్తాడంట
సూర్యుడి కోరిక మేరకు ఆయన కూతురు సువర్చలాదేవీని హనుమ పెళ్లి చేసుకుంటాడంట