మహిళలు ఏ రోజు తలస్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మహిళల తలస్నానం విషయంలో కొన్ని నమ్మకాలు.. విశ్వాసాలు ఉన్నాయి. ఏ రోజు తలస్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి.
స్త్రీలు సోమవారం తలస్నానం చేస్తే కుటుంబంలో గొడవలు రావు. కుటుంబ క్షేమం కోసం సోమవారం మహిళలు తలస్నానం చేయాలి.
మహిళలు మంగళవారం తలస్నానం చేస్తే భర్తతో గొడవలు వస్తాయి. మీ కాపురంలో కలహాలు రాకుండా ఉండాలంటే మంగళవారం తలస్నానం చేయరాదు.
స్త్రీలు బుధవారం తలస్నానం చేస్తే ధనలాభం కలుగుతుంది.
మహిళలు గురువారం తలస్నానం చేస్తే ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
తలస్నానం మహిళలు శుక్రవారం చేస్తే మంగళకరం.. సౌభాగ్యం కలుగుతుంది.
ఈరోజు మహిళలు తలస్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి.
స్త్రీలు ఆదివారం తలస్నానం చేస్తే శుభం జరుగుతుంది. జీవితంలో విజయం లభిస్తుంది.
ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, విశ్వాసంపై ఆధారపడి మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించలేదు.