చేతికి రక్షణ దారం కట్టుకుంటున్నారా? ఈ 5 నియమాలు ముందుగా తెలుసుకోండి..
చేతికి రక్షణ దారం కట్టుకుంటున్నారా? ఈ 5 నియమాలు ముందుగా తెలుసుకోండి..హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాల ప్రకారం చేతిపై వ్యక్తుల చేతులపై ఎర్రటి రక్షణ దారం కట్టుకుంటున్నారా.. ? ముందుగా ఆ నియమాలు ఏంటో తెలుసుకోండి..
చేతికి కట్టుకునే రక్షా సూత్రం.. అదేమనండి రక్షా బంధనం కట్టుకునే ముందు ఈ నియమాలను పాటిస్తున్నారా..! దీనికి సంబంధించిన కొన్ని నియమాలను తెలుసుకుందాం.
రక్షా సూత్రాన్ని ఎవరైనా.. 21 రోజులు ధరించాలి. ఎందుకంటే 21 రోజుల తర్వాత దాని రంగు మసకబారడం ప్రారంభమవుతుంది.
రక్షా సూత్రాన్ని చేతి నుండి తీసివేసిన తర్వాత మట్టిలో పాతిపెట్టాలి.
రంగు వాడిపోయిన తర్వాత, అరిగిపోయిన రక్షా సూత్రంలో ప్రతికూల శక్తి దాగి ఉంటుంది. అందుకే రంగు పోగానే చేతికి పెట్టుకోకుండా తీసేయాలి.
గ్రహ దోషాలు: చేతికి కట్టుకునే రక్షణ దారం రంగు పోవడం వల్ల అది కట్టుకునే వాళ్లకు గ్రహ దోషాల బారిన పడతారు.
చేతికి కట్టుకునే రక్షా దారాన్ని ధరించేటపుడు ఇష్ట దైవానికి సంబంధించిన మంత్రాన్ని పఠించిన తర్వాత కానీ ఈ రక్షా దారాన్ని కట్టుకోవాలి.
ఈ వార్త మీకు తెలియజేసే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాయబడింది. ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారంగా మేము ఈ విషయాలను ప్రస్తావించాము. ZEE Media దీనిని ధృవీకరించడం లేదు. ఏదైనా సందేహాలు ఉంటే..పురోహితులను కానీ.. పండితులను సలహాలు సూచనలను తీసుకొంది..