జూలై 17న తొలి ఏకాదశి. మరి ఇంత పవిత్రమైన రోజున ఏమి చేయాలి..ఏమి చేయకూడదు ఒకసారి చూద్దాం..
తొలి ఏకాదశి రోజు తెల్లవారి జామునే లేచి.. తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించాలి.
ఈరోజు మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతో మంచిది.
ఈరోజు ఉదయాన్నే తప్పనిసరిగా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి
రోజంతా ఉపవాసం ఉండి.. మరసటి రోజు అయిన ద్వాదశి రోజు నాడు.. గుడికి వెళ్లి.. ఉపవాసం దీక్షను విరమించాలి
పేదలకు ధాన్యాలు, వస్త్రాలు.. ఈరోజు దానం చేయడం ఎంతో మంచిది.
అయితే ఏకాదశి రోజు.. మాంసం, మద్యం అసలు ముట్టకూడదు
గోర్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు. అలానే బ్రహ్మచర్యం పాటించాలి.