టీమిండియా క్రికెట్‌లో చెరగని ముద్ర వేశాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.
';
ఈ దిగ్గజ ఆటగాడు నేడు 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.
';
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా అన్ని ఫార్మాట్లలో టైటిల్స్‌ను ముద్దాడింది.
';
ధోనీ ఆరు టీ20 ప్రపంచకప్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు కష్టం.
';
తన కెప్టెన్సీతోనే కాకుండా వికెట్ కీపింగ్‌లోనూ ధోనీ మెరుపులు మెరిపించాడు. అందరికంటే అత్యధికంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 195 స్టంపింగ్స్ చేశాడు.
';
వన్డేల్లో అత్యధికసార్లు 84 సార్లు నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.
';
అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని 332 మ్యాచ్‌లలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరంచాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు కష్టమే. 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు.
';
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు (226) కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండో స్థానంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (158) ఉన్నాడు.