ఐపీఎల్ హిస్టరీలో RCB vs SRH మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు బద్దలైంది. బెంగళూరులోని చిన్నస్వామిలో జరిగిన ఈ మ్యాచ్ లో మొత్తం 549 పరుగులు వచ్చాయి.
రెండవ స్థానంలో ఈ సీజన్ లోనే జరిగిన SRH vs MI మ్యాచ్ ఉంది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 523 పరుగులు నమోదయ్యాయి.
2010లో CSK vs RR మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు కలిపి 469 పరుగులు చేశాయి. ఇది మూడో స్థానంలో ఉంది.
సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన రికార్డును తానే బద్దలుగొట్టింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించింది.
ఈ సీజన్ ప్రారంభంలో సన్ రైజర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 277 పరుగులు చేసింది. 20 రోజుల్లోనే హైదరాబాద్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది.
ఎస్ హెర్ఆర్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ రికార్డు 39 బంతుల్లోనే రికార్డు సెంచరీ సాధించాడు. అతడు . 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 102 పరుగుల కొట్టాడు.
288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీ జట్టు అద్భుతంగా పోరాడింది. అయితే ఆ జట్టు 25 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఆర్సీబీ తరపున దినేష్ కార్తీక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును 262 పరుగులకు చేర్చాడు.
ట్రావిస్ హెడ్ కేవలం 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన నాలుగో సెంచరీ.