అత్యధిక సిక్సర్లు: ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో 38 సిక్సర్లు నమోదయ్యాయి. టీ20 క్రికెట్‌లో ఇది సరికొత్త రికార్డు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో బాల్ఖ్ లెజెండ్స్ వర్సెస్ కాబుల్ జవానాన్ మ్యాచ్‌లో 37 సిక్సర్లు నమోదయ్యాయి
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు: నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (MI) 20 సిక్సర్లు కొట్టి రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఆర్సీబీ(21 సిక్సర్లు) ఉంది.
రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు: ఐపీఎల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అతిపెద్ద టీమ్ స్కోర్(246) చేసిన జట్టుగా ముంబై టీమ్ నిలిచింది. గతంలో ఆ రికార్డు రాజస్థాన్ రాయల్స్ పేరిట(226) ఉండేది.