అత్యధిక స్కోరు: ఉప్పల్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. ఇదే ఐపీఎల్ లో అత్యధిక స్కోరు. గతంలో ఈ రికార్డు ఆర్సీబీ(263 పరుగుల) పేరిట ఉండేది.

';

అత్యధిక సిక్సర్లు: ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో 38 సిక్సర్లు నమోదయ్యాయి. టీ20 క్రికెట్‌లో ఇది సరికొత్త రికార్డు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో బాల్ఖ్ లెజెండ్స్ వర్సెస్ కాబుల్ జవానాన్ మ్యాచ్‌లో 37 సిక్సర్లు నమోదయ్యాయి

';

టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసిన స్కోరు 523. ఇది ఐపీఎల్ మరియు టి20 క్రికెట్‌లో అతిపెద్ద రికార్డు.

';

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు: నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (MI) 20 సిక్సర్లు కొట్టి రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఆర్సీబీ(21 సిక్సర్లు) ఉంది.

';

రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు: ఐపీఎల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అతిపెద్ద టీమ్ స్కోర్(246) చేసిన జట్టుగా ముంబై టీమ్ నిలిచింది. గతంలో ఆ రికార్డు రాజస్థాన్ రాయల్స్ పేరిట(226) ఉండేది.

';

ముంబై ఇండియన్స్ టాప్-6 బ్యాటర్లు 20 పరుగులు చేశారు. ఇలా జరగడం ఐపీఎల్ హిస్టరీలో ఇదే తొలిసారి.

';

ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌లో 69 ఫోర్లు, సిక్సర్లు నమోదయ్యాయి. అంతకుముందు, CSK vs RR మ్యాచ్ (IPL 2010)లో కూడా ఇన్నే బౌండరీలు వచ్చాయి.

';

చెత్త రికార్డు: ఈ మ్యాచ్‌లో ముంబైకి చెందిన క్వేనా మఫాకా 4 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ అరంగేట్రంలో ఏ బౌలర్ కూడా ఇంత చెత్త బౌలింగ్ చేయలేదు.

';

VIEW ALL

Read Next Story