టీ20 క్రికెట్ బ్యాటర్ల గేమ్ గా పేరొందింది. అయితే ఒక్కోసారి బౌలర్లు కూడా అది కలిసి వస్తుంది.
పాకిస్థాన్ ఆటగాడు షహీన్ అఫ్రిది కొత్త బంతితో మెుదటి ఓవర్ వేసేటప్పుడు చెలరేగిపోతాడు. అతడు బౌలింగ్ ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాటర్ కైనా పెను సవాలే. అతడు 137 ఇన్నింగ్స్‌ల్లో తొలి ఓవర్‌లోనే 45 వికెట్లు తీశాడు.
టీ20 క్రికెట్‌లో తొలి ఓవర్‌లో భారత్‌కు చెందిన భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు 44 వికెట్లు తీశాడు. అతను 192 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేశాడు.
ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ విల్లీ కూడా తొలి ఓవర్‌లోనే ప్రకంపనలు సృష్టించాడు. 161 టీ20 ఇన్నింగ్స్‌ల్లో తొలి ఓవర్‌లోనే 41 వికెట్లు తీశాడు.
పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ అమీర్ 153 టీ20 ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే 40 వికెట్లు పడగొట్టాడు.
200 ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన సొహైల్ తన్వీర్ తొలి ఓవర్‌లో 36 వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ 135 టీ20 ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లో 31 వికెట్లు తీశాడు.